![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -311 లో..... రుద్రని చూడడానికి సుధా వెళ్తుంది. నా అల్లుడికి దిష్టి తగిలిందని సుధా దిష్టి తీస్తుంది. ఆవిడ వచ్చి తీసేవరకు ఇక్కడ ఎవరు తియ్యరు మరి అని శకుంతల కోపంగా మాట్లాడుతుంది నువ్వు ఎలా వచ్చావని పెద్దసారు అడుగుతాడు. ఆయన తీసుకొని వచ్చారు.. బయట ఉన్నారని సుధా చెప్పగానే బయట ఉండడమేంటి.. నేను వెళ్లి తీసుకొని వస్తానని పెద్దసారు గంగ రాఘవ వెళ్తారు. వాళ్ళని చూసి విశ్వ కార్ దిగుతాడు.
ఏంటి విశ్వ లోపలకు రాలేదంటాడు పెద్దసారు. సుధా వస్తే వెళ్ళిపోతామని వర్క్ ఉందని విశ్వ అనగానే లోపలికి రండి అని పెద్దసారు తీసుకొని వెళ్తాడు. ఏం రుద్ర ఎలా ఉన్నావ్.. ఎలా జరిగిందని రుద్రతో విశ్వ మాట్లాడతాడు. రుద్ర ఎలా జరిగిందో చెప్తాడు. ఎవరో కావాలనే ఇదంతా చేశారు సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని విశ్వ అంటాడు. ఇదేంటి ఈయన అన్ని ఎంక్వైరీ చేస్తున్నాడని ఇషిక, వీరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత నువ్వు నన్ను సేవ్ చేసావ్ కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినవన్ని నేను చూసుకుంటానని విశ్వ అనగానే అది కాదు మావయ్య మీరు గంగకి ట్రైనింగ్ ఇవ్వండి.. నేను దాని గురించి చూసుకుంటానని రుద్ర అంటాడు. గంగ నువ్వు అదృష్టవంతురాలివి.. మా ఆయన నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు.. ఆయన ట్రైనింగ్ అంటే డిసిప్లైన్ గా ఉండాలి.. లేదంటే ఆయన ఒప్పుకోరు. అంతేకదండి.. రేపటి నుండి ఏ టైమ్ కి రావాలో చెప్పండి అని విశ్వని కన్విన్స్ చేసేలా సుధా మాట్లాడుతుంది. ఆ తర్వాత పెద్దసారు రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు. దాంతో విశ్వ ఒప్పుకుంటాడు.
మరొకవైపు విశ్వ, సుధాకి సంబంధించిన ఆస్తులు, నగలు, డాక్యుమెంట్లు అన్నీ కూడా జయ చూసి మురిసిపోతుంది. అప్పుడే గంగ, రుద్ర, రంగా వస్తారు. దాంతో జయ భయపడుతుంది. అవన్నీ ఎందుకు తీసావని జయని వాళ్ళు అడుగుతారు. ఇక జయ కంగారుపడుతుంది. అదే సమయంలో విశ్వ, సుధా వస్తారు. జయ అవన్నీ ఎందుకు తీసిందో అడిగాను.. అలా అడిగితే తను ఫీల్ అవుతుందని విశ్వతో రుద్ర అంటాడు. నా ఇల్లు నా ఇష్టం అన్నట్లు జయ అంటుంది. అవి తియ్యాల్సిన అవసరం ఏంటని విశ్వ అడుగుతాడు. నా చిన్నప్పటి ఫోటో గురించి వెతికానని జయ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |